Friday, December 3, 2010

రొటీన్ సినిమాలు

మన తెలుగు సినిమా ప్రస్తుతం రొటీన్ సినిమాలతోనే పయనం సాగిస్తోంది..మూస కథలతోనే సినిమాలు తీస్తున్నారు. రొటీన్ కి బిన్నంగా ఉండే సినిమాలు తీయడానికి ఎవరూ సాహసించటంలేదు..పక్క రాష్ట్రం వాళ్ళు మనకి పక్కలో బల్లెంలా తయారవుతున్నా మన తెలుగు హీరోలకి, దర్శకులకు, నిర్మాతలకు అసలు బుద్ధి రావడం లేదు. ఎమన్నా అన్నామంటే "మన తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలే నచ్చుతున్నాయి అని వాళ్లకు  వాళ్ళే సర్దిచేప్పుకుంటారు మన తెలుగు నిర్మాతలు, మాకు తియ్యడం రాదు అని చెప్పలేక! కొన్ని వెరైటీ సినిమాలు వస్తున్నాయి కాని అవి చిన్న సినిమాలు, గుర్తింపు లేని దర్సకులవడం వలన వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అటువంటి సినిమాలను ఆదరిస్తేనే కొంతైనా మన తెలుగు సినిమా బాగుపడుతుంది..చిన్న సినిమా అని ఎందుకన్నానంటే, పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోలు రొటీన్ సినిమాలు తప్ప వెరైటీ సినిమాలు చెయ్యరు కాబట్టి..ఎప్పటికైనా మన తెలుగు సినిమా రొటీన్ అనే వలయం నుండి బయటకు రావాలని ఆశిస్తున్నాను......మీ అబిప్రాయాలు తెలియజేయగలరు...

No comments:

Post a Comment